అమరావతి రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చేసుకుంటున్న ఒప్పందాల వల్ల భవిష్యత్‌లో ఈ ప్రాంతం కుంభకోణాల కేంద్రంగా మారే ప్రమాదముంది. అభివృద్ధి పేరుతో చంద్రబాబు చేస్తున్న వ్యవహారం మొత్తం కుంభకోణాలతో పాటు అసాంఘిక శక్తులను ఒకచోట చేర్చే కేంద్రంగానూ మారే అవకాశాలూ లేకపోలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను లోతుగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. రాజధాని నిర్మాణంలో తొలి నుంచీ గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతోంది. ఒప్పందం ఒక విధంగా చేసుకుని ప్రజలకు మరో విధంగా చెబుతోంది. ఈ పద్ధతిని ఏమనుకోవాలి. ప్రజా రాజధాని అంటూనే అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కేవలం ప్రజా ధనాన్ని లూఠీ చేయడం కోసమే ప్రభుత్వం ఈ విధానాలను, పద్ధతులను అనుసరిస్తోంది. ప్రపంచబ్యాంకు విధానాలను వేగంగా అమలు చేసే చంద్రబాబునాయుడు అదే ప్రపంచబ్యాంకు స్విస్ ఛాలెంజ్ నష్టదాయమని చెప్పినా పట్టించుకోకుండా ముందుకు పోతున్నారు. కేల్కర్ కమిటీ కూడా స్విస్ ఛాలెంజ్ సరైన పద్ధతి కాదని తెలిపింది. ఇదొక అంశమైతే అసలు రాజధానిలో విదేశీ యాజమాన్యం చేతిలో ఉండే కంపెలు నిర్మించే భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవడం సిగ్గుచేటు. ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్ కంపెనీలు నిర్మించే భవనాలపై యాజమాన్య హక్కులు ఎవరికి ఉంటాయనేది స్పష్టత లేదు. ఒకవేళ డబ్బులిచ్చి నిర్మించుకునేటట్లయితే ఓపెన్ టెండర్ విధానానికి ఎందుకు వెళ్లరు. మేక్ ఇన్ ఇండియా అని కేంద్రం ప్రచారం చేస్తోంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మేక్ ఇన్ ఇండియా అవసరం లేదా ? సీడ్ కేపిటల్ డెవలప్‌మెంట్ ఏరియాలో సింగపూర్ కంపెనీలు భవనాలు నిర్మించిన తరువాత వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ పద్ధతిలో ఉంటుందనే విషయాన్నీ స్పష్టం చేయలేదు. వాటిని లీజుకు తీసుకుంటారా? కొనుగోలు చేస్తారా? అద్దెలు చెల్లిస్తారా అనే విషయాలపైనా స్పష్టత లేదు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఉన్న అంశాన్ని బయటకు రానీయకుండా చూస్తోంది. వచ్చినా అసలు విషయాలు చెప్పకుండా దాచిపెడుతోంది. ఒకవైపు ప్రజా రాజధాని అంటూనే ప్రజలకు చెప్పాల్సిన ఏ సమాచారాన్నీ చెప్పడం లేదు. రైతుల నుంచి తీసుకున్న భూములను ఉచితంగానో, కారుచౌకగానో ప్రయివేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తోంది. పూలింగుకు భూములివ్వబోమన్న రైతుల గోళ్లూడగొట్టింది. భయపెట్టింది. పోలీసులతో కొట్టించి జైళ్లలో పెట్టించింది. వ్యతిరేకిస్తున్న వారిళ్లకు పోలీసులను పంపించి అరెస్టుల పేరుతో భయానక వాతావరణం సృష్టించింది. భూములు తీసుకుంది. వాటినిప్పుడు విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఈ మొత్తం ప్రక్రియ వెనుక పెద్దపెద్ద సంస్థల ప్రయోజనాలు, తద్వారా వారితో అనుబంధం ఉన్న వ్యక్తులతో రాజకీయ, ఆర్థిక లబ్ధిపొందడం కీలకంగా కనిపిస్తోంది మినహా ప్రజా ప్రయోజనం మచ్చుకైనా కనిపించడం లేదు. విశ్వసనీయత లేని స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఎంచుకోవడమే కుంభకోణాలు జరుగుతాయనే అనుమానాలకు బలాన్నిస్తోంది. ఇంతకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వానికి, రవి కన్సల్టెన్సీకి మధ్య జరిగిన వివాదంలో మద్రాసు హైకోర్టు స్విస్ ఛాలెంజ్ పద్ధతి కరెక్టు కాదని తీర్పుచెప్పింది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే స్విస్ ఛాలెంజ్‌కు ఆమోదం తెలిపినా దానిలోని విషయాలన్నీ ప్రజలకు వివరించాలని పేర్కొంటూ అనుమతిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎవరూ ఈ పద్ధతిని వాడుకలోకి తీసుకోలేదు. ఈ పద్ధతి నిజంగా కంపెనీల మధ్య పోటీకి పిలిచిందా లేక ప్రజలను నమ్మించేందుకు ప్రభుత్వం ఆడుతున్న నాటకమా అనే విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా స్విస్ ఛాలెంజ్ కరెక్టా, కాదా, ప్రభుత్వం చేస్తోంది మోసమా, లాభమా అనే విషయాలను ప్రజలే నిర్ణయిస్తారు. ఇలా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ప్రభుత్వం ఏమి చేస్తుందనే విషయం ఇప్పటి వరకూ ఎవరికీ అర్థం కావడం లేదు. ఏకపక్షంగా చేసుకుపోతోంది. భూములు తీసుకున్న తరువాత ఉపాధి కోల్పోయేవారికి ఆ ప్రాంతంలో ఉపాధి కల్పిస్తామని చెప్పింది. అరకొరగానే కల్పించింది. కౌలు చెక్కులూ అందడం లేదు. నిరుద్యోగ యువతకు ఉపాధి లేదు. సమీకరణకు ముందు ప్రభుత్వమిచ్చిన ఏ హామీ పూర్తిగా అమలు కాలేదు. అమలయిందల్లా భూములు లాక్కోవడమే. ఈ ప్రక్రియకు ముందే సింగపూర్‌కు చెందిన ప్రయివేటు కంపెనీలకు వాటిని అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి సింగపూర్ ప్రభుత్వం తమకు ఉచితంగా ప్లానిస్తోందని పదేపదే చెప్పారు. ఇదీ అబద్ధమే. భూములు తీసుకోక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు అబద్ధాలు చెప్పారు. వాటిల్లో ఒకటి భూమిని ఎవరికీ ఇవ్వబోమని, రెండోది సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ప్లానిస్తోందని. అలా చెప్పి ప్రజలను మోసం చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు, అర్ధసత్యాలు. అందుకే కుంభకోణాల కేంద్రం అవుతుందని వ్యాఖ్యానించాల్సి వచ్చింది. అలా జరగదు అని ప్రభుత్వ పెద్దలు ఎవరైనా చెబితే, ఒప్పందాల విషయాన్ని ఇప్పటి వరకూ ఎందుకు గోప్యంగా ఉంచారో అదన్నా చెప్పాలి. దీని వెనుక ప్రధానంగా రెండు కుట్రలున్నాయి. ఒకటి రాజధాని ప్రాంతాన్ని విదేశీ సంస్థలకు కట్టబెట్టడం, రెండోది దాని ద్వారా అయాచిత లబ్ధిపొందడం.
చీకటి ఒప్పందం
రాజధాని ప్లానింగుకు సంబంధించి 2014 ఆగస్టు 8వ తేదీన అప్పటి సదుపాయాల కల్పనశాఖ ఛైర్మన్ దొండపాటి సాంబశివరావు, ఇంటర్నేషన్ ఎంటర్‌ప్రైజెస్ సిఇఒ తోఎంగ్ చియాంగ్ మధ్య పరస్పర ఒప్పందం జరిగింది. దీనిలో పలు దశలుగా పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే క్లాజ్ 3(1)లో నిర్మాణ రంగాన్ని కచ్చితంగా సింగపూర్ సంస్థలకు అప్పగిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. 3(2)లో ఒకటి లేదా అంతకు మించి కంపెనీలతో కూడిన మాస్టర్ డెవలపర్‌ను సింగపూర్ ప్రతిపాదిస్తుంది అని పేర్కొన్నారు. 3(3)లో సింగపూర్ ప్రభుత్వం ఇచ్చే మాస్టర్ డెవలపర్‌ను ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఆమోదిస్తుంది అని స్పష్టంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. సెక్షన్ 5(1)లో రాజధాని ప్లానింగు ఏర్పాటు, తదితర అంశాలకు సింగపూర్‌కయ్యే ఖర్చును ఉమ్మడిగా భరించాలని పేర్కొన్నారు. 2014లోనే నిర్మాణ కంపెనీలను సింగపూర్ ప్రతిపాదిస్తుందని ఒప్పందం చేసుకుని ఇప్పుడేదో కొత్తగా అనుభవమున్న కంపెనీలను ఎంచుకుంటున్నట్లు ప్రభుత్వం ఫోజు పెడుతోంది. ఇది ప్రజలను పక్కాగా మోసం చేయడమే, సొమ్మును లూఠీ చేయడమే అవుతుంది. ఒప్పందం చేసుకున్న కంపెనీలు రెండూ పూర్తిగా వ్యాపారం నిర్వహించేవే. ప్రపంచంలో ఎక్కడైనా లాభాలు వస్తున్నాయంటే అక్కడ వాలిపోయే సంస్థలు. ఆ విషయాన్ని అవే ఒప్పకుంటున్నాయి. ఇటువంటి సంస్థలను తీసుకొచ్చి ప్రజా రాజధానిగా ప్రచారం చేస్తున్న అమరావతిలో పెట్టడం, పైగా అటువంటి సంస్థలు ప్రపంచంలో మరెక్కడా లేవని చెప్పేందుకు దేశవాళీ సంస్థలపై విషంగక్కడం అవమానకరం.
ఉచితమనేది ఒట్టిమాట
రాజధాని నిర్మాణానికి ప్లానింగిచ్చిన సుబ్బారా, జురాంగ్ ఇంటర్నేషనల్ కంపెనీలు ఉచితంగా ఇచ్చాయని చెప్పడం ఒట్టిమాటే అవుతుంది. ఆగస్టు 28వ తేదీన జరిగిన సిఆర్‌డిఎ తొలి అథారిటీ సమావేశంలో ప్లానింగు ఇచ్చినందుకు రూ.11.92 కోట్లు ఇవ్వాలని తీర్మానించారు. 2016 మే నాలుగో తేదీన జరిగిన రెండో సమావేశంలో దాన్ని రూ.14,79,66,934కు పెంచారు. మాస్టర్ ప్లాను రివిజన్ చేసినందుకు ఈ మొత్తాన్నిచ్చామని ప్రతిపాదించారు. అంటే ఉచితంగా ప్లాను ఇవ్వలేదని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఇప్పటికీ సింగపూర్ కంపెనీలు ఉచితంగా ప్లానిచ్చాయని ప్రచారం చేస్తున్నారు. ఏ లబ్ధీ ఆశించనప్పుడు ప్రయివేటు కంపెనీలను ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి.
కన్సార్టియంలో దేశీయ కంపెనీల వాటా
రాజధాని అభివృద్ధికి ఏర్పాటు చేసిన సింగపూర్ కన్సార్టియంలో ఉన్న సెంబ్‌కార్ప్, అసెండాస్ సింగ్‌బ్రిడ్జ్ కంపెనీలు ఆకాశం నుంచి ఊడిపడినట్లు చంద్రబాబు ప్రచారం చేయడం శుద్ధఅబద్ధం. ఆయా కంపెనీలు ఇప్పటికే దేశంలో విద్యుత్, నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో కృష్ణపట్నంలో 2,640 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కంపెనీ గాయత్రి పవర్ లిమిటెడ్ పేరుతో నిర్మించింది. ఇది పార్లమెంటు మాజీ సభ్యులు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి, ఆయన వియ్యంకుడు జివికెకు చెందినది. దీనిలోనే టివి సందీప్‌కుమార్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. డి వెంకటాచలం కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. ఆయన వివిధ విద్యుత్ సంస్థల్లో ధరల సలహాదారుగా ఉన్నారు. సెంబ్‌కార్ప్ గ్రీన్ ఇన్‌ఫ్రాలో సునీల్‌కుమార్ గుప్తా, సతీష్‌కుమార్ మందన, విజరు ఎల్ కేల్కర్, బాబీ కునాబారు పారిక్ డైరెక్టర్లుగా ఉన్నారు. అసెండాస్ సింగ్‌బ్రిడ్జ్‌లో మన దేశానికే చెందిన ఎస్ చంద్రన్ ఇండిపెండెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మనోహర్ ఖైతాని డిప్యూటీ సిఇఒగా వ్యవహరిస్తున్నారు. ఆకాశం నుంచి ఊడిపడిన సంస్థల్లో భారతీయులు ఎందుకున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్లానింగిచ్చిన సుర్బానా ఇంటర్నేషనల్ అసెండాస్ భాగస్వామి. ఇవేమీ తెలియనట్లు సింగపూర్ కంపెనీలే అన్నీ చేస్తాయని చెప్పడం శుద్ధ అబద్ధం. పైగా ఆ రెండు కంపెనీలూ సింగపూర్ ప్రభుత్వానికి చెందిన టెమాసెక్‌లో వ్యాపార భాగస్వామిగా ఉన్నాయి. దీనిలో సెంబ్‌కార్ప్ వాటా 51 శాతానికి పెంచుకున్నారు. మిగిలిన వాటాలను కూడా ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ముందు పూర్తిగా ప్రయివేటు వ్యాపారం నిర్వహించుకోనున్నారు. టెమాసెక్ అనేది సింగపూర్ కేంద్రంగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. ప్రపంచంలోని ప్రయివేటు పెట్టుబడ ిదారులను పెంచి పోషించడమే దీని ప్రధాన ఉద్దేశంగా ఉంది. ఇటువంటి కంపెనీలను నెత్తికెత్తుకుని మాట్లాడుతున్న చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవానికి అన్యాయం చేశారు.
చివరిగా ఒకమాట. ప్రపంచంలో అనేక దేశాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తోంది, పెద్దపెద్ద రోడ్లు వేస్తోంది భారతీయ కంపెనీలే. వాటిని పట్టించుకోకుండా ప్రయివేటు వ్యక్తుల వ్యాపార లావాదేవీల కోసం పాకులాడే సింగపూర్ కంపెనీల చుట్టూ తిరగడం దోచుకోవడానికి తప్ప మరొకటి కాదు. విదేశీ యాజమాన్యం చేతుల్లో ఉండే కంపెనీల ద్వారా మన అ
సెంబ్లీ నిర్వహించుకోవడం నిజంగా సిగ్గుచేటైన విషయం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి