2, జులై 2016, శనివారం

స్విచ్‌ ఛాలెంజ్‌ పద్దతిలో మొక్కబడిగా టెండర్లపిలచి అనుకున్న కంపెనీలకు కట్టబెటాలని కుట్ర జరుగుతుంద న్నారు. మూడువేల ఎకరాలు భూమిని ప్రభుత్వవాటాగా విదేవీ కంపెనీలు ఆర్థిక రూపంలో పెట్టుబడులు పెడతా యని వచ్చిన లాభాలను పంచుకుంటా మని ముఖ్యమంత్రే చెప్పారని ప్రభు త్వం పరిపాలన చేయాలే తప్స వ్యాపం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. మూడు వేల ఎకరాలు భూమి విలువసుమారు 7500 కోట్లు ఉంటుందని ప్రభుత్వం ఏధరను నిర్ణయించిందో బయటపెట్టాలన్నారు. ప్రైవేటు భాగస్వామ్యానికి సంబంధించిన విధి విదానాలను వెల్లడించాలన్నారు. 29 గ్రామాలల్లో నిర్మాణాలు ఎప్పడు చేస్తోరో చెప్పాలన్నారు. ఉద్యోగులుపేదుల ఇతరులు నివాస గృహాలు ఎవరు నిర్మిస్తారు. వాటిని ఎలాకేయిస్తారో సీడ్‌ క్యాపిటల్‌ ప్రస్తుత గ్రామాలు కొనసపాగిస్తారా? తొలగిస్తారా? తదితర ప్రశ్నల కు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నానని, ఇక్కడకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని, చైనా నుంచి ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని శుక్రవారం విజయవాడ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనాలో పారిశ్రామికవేత్తలను కలిశానని, ఉత్తమ నైపుణ్యాలకు చైనా మారుపేరని, ప్రపంచంలోని వేగవంతమైన రైళ్లన్నీ చైనాలోనే ఉన్నాయని, మనకంటే ముందే చైనాలో సంస్కరణలు అమలయ్యా యని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండోతరం పారిశ్రామికవేత్తలను తయారు చేసిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలో నెంబర్ వన్ పెట్టుబడిదారులు యూదులని, ఏపీలో కూడా అంతటి శక్తి సామర్థ్యాలున్నాయని ఆయన అన్నారు. ఏపీ పారిశ్రామికవేత్తలను ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని, మనవాళ్లు ఇతర దేశాల్లో వ్యాపారం చేయాలని, బయటివారు మన దగ్గర వ్యాపారం చేయాలని చంద్రబాబు అన్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను కాంగ్రెస్ దెబ్బతీసిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఇమేజ్‌ను ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, నీతి, నిజాయితీగా ఏపీలో ఉన్న పారిశ్రామిక వేత్తలను ఉత్తమ పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. చైనాలో 60 అంతస్తుల భవనాన్ని 30 రోజుల్లో కట్టారని ప్రధాని మోడీ తనతో చెప్పారని చంద్రబాబు అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు ఆన్‌స్టీల్ సంస్థ, లిబ్రా గ్రూప్ నౌకాయానం, ఆతిథ్య రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయని, చైెనాలో ఉన్నా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిణామాలను తెలుసుకున్నానని ఆయన అన్నారు. దేశమంతా ఎల్ఈడీ బల్బులు వాడితే రూ. 40 వేల కోట్లు ఆదా అవుతుందని, విద్యుత్ పొదుపు చేసే పంపుసెట్ల వాడకంపై దృష్టి పెట్టినట్లు చంద్రబాబు వెల్లడించారు. టెక్నాలజీ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నామని, ఊహకు అందని రాజధానిని నిర్మిస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో 9 నగరాలను అభివృద్ధి చేస్తామని, రాజధానిలో హైటెన్షన్ వైర్లకే రూ.1500కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ తెలంగాణకే చెందుతుందనడం సరికాదని, అందరూ కష్టపడి ఏపీ భవన్‌ను నిర్మించారని అన్నారు. గొడవల వల్ల సాధించేదేమీ లేదని, హైదరాబాద్ బాగుండాలి, అమరావతి బాగుండాలని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి ఉమాభారతిని కలిశానని, పోలవరానికి నాబార్డు నిధులు కేటాయించాలని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. నీటి విషయంలో అపెక్స్ కమిటీ వేయాలని, రాష్ట్రాలే సమస్య పరిష్కరించుకోవాలనడం సరికాదని, కేంద్రం చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అన్నారు.

స్విస్ ఛాలెంజ్‌కు ఏపీ స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్‌
అంద‌రూ ఊహించిన‌ట్లుగానే ఏపీ స‌ర్కార్ స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తికి ఆమోదం తెలిపింది. ప్ర‌జ‌లు.. ప్ర‌తిప‌క్షాలు స్విచ్ ఛాలెంజ్‌ను వ్య‌తిరేకిస్తున్నా చంద్ర‌బాబు మొండిగా ముందుకెళ్తున్నారు. స్విస్ ఛాలెంజ్ ప్ర‌కారం సింగపూర్ సంస్థలకు అమరావతిలో భూములు అప్పగించనున్నారు. రాజధాని అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే కంపెనీలో సింగపూర్ సంస్థలకు 58 శాతం వాటా, ఏపీ సర్కారుకు 42 శాతం ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. సర్కారు కట్టేది రాజధాని మాత్రమేనని..మిగిలింది అంతా లే అవుట్ రెడీ చేస్తామని చెప్పారు. స్విస్ ఛాలెంజ్ పై కొంత మంది విమర్శలు చేస్తున్నారని…చాలా క్షుణ్ణంగా అన్ని అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాజధాని అభివృద్ధికి ముందుకొచ్చిన సంస్థలు అసెండాస్, సెంబ్ కార్ప్, సింగ్ బ్రిడ్జిల్లో సింగపూర్ ప్రభుత్వానికి 74 శాతంపైగా వాటా ఉందని..మిగిలిన వాటా ప్రజల చేతుల్లో ఉందని చంద్రబాబు వెల్లడించారు. అమరావతి డెవలప్ మెంట్ కన్షార్షియంకు 1691 ఎకరాలు అప్పగించనున్నట్లు తెలిపారు. 50 ఎకరాలు మాత్రం నామమాత్రపు ధరకు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. మన దేశంలో ఎన్టీపీసీ, ఓఎన్ జీసీ సంస్థలు ఎలాంటివో అసెండాస్ , సింగ్ బ్రిడ్జి సెంబ్ కార్ప్ సంస్థలు అటువంటివే అని తెలిపారు.
అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్ కోసం 50 ఎకరాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు మరికొన్ని సంస్థలకు కూడా భూములు కేటాయించారు. వీఐటీ విద్యాసంస్థకు 200 ఎకరాలు కేటాయించారు. ధర ఎకరానికి 50 లక్షలకే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కు 5 ఎకరాలు, ఎన్ఐడీకి 50 ఎకరాలు ఏపీ హెచ్ఆర్‑డీఏకి 25 ఎకరాలు, టీటీడీకి 25 ఎకరాల భూమిని ఎకరానికి 50 లక్షలకే విక్రయిస్తున్నట్లుగా చంద్రబాబు పేర్కొన్నారు. మరికొన్ని కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వాటిపై మరోసారి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తితో మునుముందు ఎదురు కానున్న ప‌రిణామాల‌ను స‌ర్కార్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

రాజధాని నిర్మాణం-కుంభకోణాల కేంద్రం

అమరావతి రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చేసుకుంటున్న ఒప్పందాల వల్ల భవిష్యత్‌లో ఈ ప్రాంతం కుంభకోణాల కేంద్రంగా మారే ప్రమాదముంది. అభివృద్ధి పేరుతో చంద్రబాబు చేస్తున్న వ్యవహారం మొత్తం కుంభకోణాలతో పాటు అసాంఘిక శక్తులను ఒకచోట చేర్చే కేంద్రంగానూ మారే అవకాశాలూ లేకపోలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను లోతుగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. రాజధాని నిర్మాణంలో తొలి నుంచీ గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతోంది. ఒప్పందం ఒక విధంగా చేసుకుని ప్రజలకు మరో విధంగా చెబుతోంది. ఈ పద్ధతిని ఏమనుకోవాలి. ప్రజా రాజధాని అంటూనే అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కేవలం ప్రజా ధనాన్ని లూఠీ చేయడం కోసమే ప్రభుత్వం ఈ విధానాలను, పద్ధతులను అనుసరిస్తోంది. ప్రపంచబ్యాంకు విధానాలను వేగంగా అమలు చేసే చంద్రబాబునాయుడు అదే ప్రపంచబ్యాంకు స్విస్‌ ఛాలెంజ్‌ నష్టదాయమని చెప్పినా పట్టించుకోకుండా ముందుకు పోతున్నారు. కేల్కర్‌ కమిటీ కూడా స్విస్‌ ఛాలెంజ్‌ సరైన పద్ధతి కాదని తెలిపింది. ఇదొక అంశమైతే అసలు రాజధానిలో విదేశీ యాజమాన్యం చేతిలో ఉండే కంపెలు నిర్మించే భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవడం సిగ్గుచేటు. ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్‌ కంపెనీలు నిర్మించే భవనాలపై యాజమాన్య హక్కులు ఎవరికి ఉంటాయనేది స్పష్టత లేదు. ఒకవేళ డబ్బులిచ్చి నిర్మించుకునేటట్లయితే ఓపెన్‌ టెండర్‌ విధానానికి ఎందుకు వెళ్లరు. మేక్‌ ఇన్‌ ఇండియా అని కేంద్రం ప్రచారం చేస్తోంటే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి మేక్‌ ఇన్‌ ఇండియా అవసరం లేదా ? సీడ్‌ కేపిటల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాలో సింగపూర్‌ కంపెనీలు భవనాలు నిర్మించిన తరువాత వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ పద్ధతిలో ఉంటుందనే విషయాన్నీ స్పష్టం చేయలేదు. వాటిని లీజుకు తీసుకుంటారా? కొనుగోలు చేస్తారా? అద్దెలు చెల్లిస్తారా అనే విషయాలపైనా స్పష్టత లేదు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ప్రైజెస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఉన్న అంశాన్ని బయటకు రానీయకుండా చూస్తోంది. వచ్చినా అసలు విషయాలు చెప్పకుండా దాచిపెడుతోంది. ఒకవైపు ప్రజా రాజధాని అంటూనే ప్రజలకు చెప్పాల్సిన ఏ సమాచారాన్నీ చెప్పడం లేదు. రైతుల నుంచి తీసుకున్న భూములను ఉచితంగానో, కారుచౌకగానో ప్రయివేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తోంది. పూలింగుకు భూములివ్వబోమన్న రైతుల గోళ్లూడగొట్టింది. భయపెట్టింది. పోలీసులతో కొట్టించి జైళ్లలో పెట్టించింది. వ్యతిరేకిస్తున్న వారిళ్లకు పోలీసులను పంపించి అరెస్టుల పేరుతో భయానక వాతావరణం సృష్టించింది. భూములు తీసుకుంది. వాటినిప్పుడు విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఈ మొత్తం ప్రక్రియ వెనుక పెద్దపెద్ద సంస్థల ప్రయోజనాలు, తద్వారా వారితో అనుబంధం ఉన్న వ్యక్తులతో రాజకీయ, ఆర్థిక లబ్ధిపొందడం కీలకంగా కనిపిస్తోంది మినహా ప్రజా ప్రయోజనం మచ్చుకైనా కనిపించడం లేదు. విశ్వసనీయత లేని స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిని ఎంచుకోవడమే కుంభకోణాలు జరుగుతాయనే అనుమానాలకు బలాన్నిస్తోంది. ఇంతకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వానికి, రవి కన్సల్టెన్సీకి మధ్య జరిగిన వివాదంలో మద్రాసు హైకోర్టు స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతి కరెక్టు కాదని తీర్పుచెప్పింది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే స్విస్‌ ఛాలెంజ్‌కు ఆమోదం తెలిపినా దానిలోని విషయాలన్నీ ప్రజలకు వివరించాలని పేర్కొంటూ అనుమతిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎవరూ ఈ పద్ధతిని వాడుకలోకి తీసుకోలేదు. ఈ పద్ధతి నిజంగా కంపెనీల మధ్య పోటీకి పిలిచిందా లేక ప్రజలను నమ్మించేందుకు ప్రభుత్వం ఆడుతున్న నాటకమా అనే విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా స్విస్‌ ఛాలెంజ్‌ కరెక్టా, కాదా, ప్రభుత్వం చేస్తోంది మోసమా, లాభమా అనే విషయాలను ప్రజలే నిర్ణయిస్తారు. ఇలా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ప్రభుత్వం ఏమి చేస్తుందనే విషయం ఇప్పటి వరకూ ఎవరికీ అర్థం కావడం లేదు. ఏకపక్షంగా చేసుకుపోతోంది. భూములు తీసుకున్న తరువాత ఉపాధి కోల్పోయేవారికి ఆ ప్రాంతంలో ఉపాధి కల్పిస్తామని చెప్పింది. అరకొరగానే కల్పించింది. కౌలు చెక్కులూ అందడం లేదు. నిరుద్యోగ యువతకు ఉపాధి లేదు. సమీకరణకు ముందు ప్రభుత్వమిచ్చిన ఏ హామీ పూర్తిగా అమలు కాలేదు. అమలయిందల్లా భూములు లాక్కోవడమే. ఈ ప్రక్రియకు ముందే సింగపూర్‌కు చెందిన ప్రయివేటు కంపెనీలకు వాటిని అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి సింగపూర్‌ ప్రభుత్వం తమకు ఉచితంగా ప్లానిస్తోందని పదేపదే చెప్పారు. ఇదీ అబద్ధమే. భూములు తీసుకోక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు అబద్ధాలు చెప్పారు. వాటిల్లో ఒకటి భూమిని ఎవరికీ ఇవ్వబోమని, రెండోది సింగపూర్‌ ప్రభుత్వం ఉచితంగా ప్లానిస్తోందని. అలా చెప్పి ప్రజలను మోసం చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు, అర్ధసత్యాలు. అందుకే కుంభకోణాల కేంద్రం అవుతుందని వ్యాఖ్యానించాల్సి వచ్చింది. అలా జరగదు అని ప్రభుత్వ పెద్దలు ఎవరైనా చెబితే, ఒప్పందాల విషయాన్ని ఇప్పటి వరకూ ఎందుకు గోప్యంగా ఉంచారో అదన్నా చెప్పాలి. దీని వెనుక ప్రధానంగా రెండు కుట్రలున్నాయి. ఒకటి రాజధాని ప్రాంతాన్ని విదేశీ సంస్థలకు కట్టబెట్టడం, రెండోది దాని ద్వారా అయాచిత లబ్ధిపొందడం.
చీకటి ఒప్పందం
రాజధాని ప్లానింగుకు సంబంధించి 2014 ఆగస్టు 8వ తేదీన అప్పటి సదుపాయాల కల్పనశాఖ ఛైర్మన్‌ దొండపాటి సాంబశివరావు, ఇంటర్నేషన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సిఇఒ తోఎంగ్‌ చియాంగ్‌ మధ్య పరస్పర ఒప్పందం జరిగింది. దీనిలో పలు దశలుగా పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే క్లాజ్‌ 3(1)లో నిర్మాణ రంగాన్ని కచ్చితంగా సింగపూర్‌ సంస్థలకు అప్పగిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. 3(2)లో ఒకటి లేదా అంతకు మించి కంపెనీలతో కూడిన మాస్టర్‌ డెవలపర్‌ను సింగపూర్‌ ప్రతిపాదిస్తుంది అని పేర్కొన్నారు. 3(3)లో సింగపూర్‌ ప్రభుత్వం ఇచ్చే మాస్టర్‌ డెవలపర్‌ను ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఆమోదిస్తుంది అని స్పష్టంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. సెక్షన్‌ 5(1)లో రాజధాని ప్లానింగు ఏర్పాటు, తదితర అంశాలకు సింగపూర్‌కయ్యే ఖర్చును ఉమ్మడిగా భరించాలని పేర్కొన్నారు. 2014లోనే నిర్మాణ కంపెనీలను సింగపూర్‌ ప్రతిపాదిస్తుందని ఒప్పందం చేసుకుని ఇప్పుడేదో కొత్తగా అనుభవమున్న కంపెనీలను ఎంచుకుంటున్నట్లు ప్రభుత్వం ఫోజు పెడుతోంది. ఇది ప్రజలను పక్కాగా మోసం చేయడమే, సొమ్మును లూఠీ చేయడమే అవుతుంది. ఒప్పందం చేసుకున్న కంపెనీలు రెండూ పూర్తిగా వ్యాపారం నిర్వహించేవే. ప్రపంచంలో ఎక్కడైనా లాభాలు వస్తున్నాయంటే అక్కడ వాలిపోయే సంస్థలు. ఆ విషయాన్ని అవే ఒప్పకుంటున్నాయి. ఇటువంటి సంస్థలను తీసుకొచ్చి ప్రజా రాజధానిగా ప్రచారం చేస్తున్న అమరావతిలో పెట్టడం, పైగా అటువంటి సంస్థలు ప్రపంచంలో మరెక్కడా లేవని చెప్పేందుకు దేశవాళీ సంస్థలపై విషంగక్కడం అవమానకరం.
ఉచితమనేది ఒట్టిమాట
రాజధాని నిర్మాణానికి ప్లానింగిచ్చిన సుబ్బారా, జురాంగ్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలు ఉచితంగా ఇచ్చాయని చెప్పడం ఒట్టిమాటే అవుతుంది. ఆగస్టు 28వ తేదీన జరిగిన సిఆర్‌డిఎ తొలి అథారిటీ సమావేశంలో ప్లానింగు ఇచ్చినందుకు రూ.11.92 కోట్లు ఇవ్వాలని తీర్మానించారు. 2016 మే నాలుగో తేదీన జరిగిన రెండో సమావేశంలో దాన్ని రూ.14,79,66,934కు పెంచారు. మాస్టర్‌ ప్లాను రివిజన్‌ చేసినందుకు ఈ మొత్తాన్నిచ్చామని ప్రతిపాదించారు. అంటే ఉచితంగా ప్లాను ఇవ్వలేదని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఇప్పటికీ సింగపూర్‌ కంపెనీలు ఉచితంగా ప్లానిచ్చాయని ప్రచారం చేస్తున్నారు. ఏ లబ్ధీ ఆశించనప్పుడు ప్రయివేటు కంపెనీలను ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి.
కన్సార్టియంలో దేశీయ కంపెనీల వాటా
రాజధాని అభివృద్ధికి ఏర్పాటు చేసిన సింగపూర్‌ కన్సార్టియంలో ఉన్న సెంబ్‌కార్ప్‌, అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జ్‌ కంపెనీలు ఆకాశం నుంచి ఊడిపడినట్లు చంద్రబాబు ప్రచారం చేయడం శుద్ధఅబద్ధం. ఆయా కంపెనీలు ఇప్పటికే దేశంలో విద్యుత్‌, నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో కృష్ణపట్నంలో 2,640 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీ గాయత్రి పవర్‌ లిమిటెడ్‌ పేరుతో నిర్మించింది. ఇది పార్లమెంటు మాజీ సభ్యులు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి, ఆయన వియ్యంకుడు జివికెకు చెందినది. దీనిలోనే టివి సందీప్‌కుమార్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. డి వెంకటాచలం కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. ఆయన వివిధ విద్యుత్‌ సంస్థల్లో ధరల సలహాదారుగా ఉన్నారు. సెంబ్‌కార్ప్‌ గ్రీన్‌ ఇన్‌ఫ్రాలో సునీల్‌కుమార్‌ గుప్తా, సతీష్‌కుమార్‌ మందన, విజరు ఎల్‌ కేల్కర్‌, బాబీ కునాబారు పారిక్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జ్‌లో మన దేశానికే చెందిన ఎస్‌ చంద్రన్‌ ఇండిపెండెంట్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. మనోహర్‌ ఖైతాని డిప్యూటీ సిఇఒగా వ్యవహరిస్తున్నారు. ఆకాశం నుంచి ఊడిపడిన సంస్థల్లో భారతీయులు ఎందుకున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్లానింగిచ్చిన సుర్బానా ఇంటర్నేషనల్‌ అసెండాస్‌ భాగస్వామి. ఇవేమీ తెలియనట్లు సింగపూర్‌ కంపెనీలే అన్నీ చేస్తాయని చెప్పడం శుద్ధ అబద్ధం. పైగా ఆ రెండు కంపెనీలూ సింగపూర్‌ ప్రభుత్వానికి చెందిన టెమాసెక్‌లో వ్యాపార భాగస్వామిగా ఉన్నాయి. దీనిలో సెంబ్‌కార్ప్‌ వాటా 51 శాతానికి పెంచుకున్నారు. మిగిలిన వాటాలను కూడా ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ముందు పూర్తిగా ప్రయివేటు వ్యాపారం నిర్వహించుకోనున్నారు. టెమాసెక్‌ అనేది సింగపూర్‌ కేంద్రంగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. ప్రపంచంలోని ప్రయివేటు పెట్టుబడ ిదారులను పెంచి పోషించడమే దీని ప్రధాన ఉద్దేశంగా ఉంది. ఇటువంటి కంపెనీలను నెత్తికెత్తుకుని మాట్లాడుతున్న చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవానికి అన్యాయం చేశారు.
చివరిగా ఒకమాట. ప్రపంచంలో అనేక దేశాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తోంది, పెద్దపెద్ద రోడ్లు వేస్తోంది భారతీయ కంపెనీలే. వాటిని పట్టించుకోకుండా ప్రయివేటు వ్యక్తుల వ్యాపార లావాదేవీల కోసం పాకులాడే సింగపూర్‌ కంపెనీల చుట్టూ తిరగడం దోచుకోవడానికి తప్ప మరొకటి కాదు. విదేశీ యాజమాన్యం చేతుల్లో ఉండే కంపెనీల ద్వారా మన అ
సెంబ్లీ నిర్వహించుకోవడం నిజంగా సిగ్గుచేటైన విషయం.

22, జూన్ 2016, బుధవారం

అక్రమాల ఖజానా!



గుంటూరు జిల్లా ఖజానాశాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. శాఖకు సంబంధించి జిల్లాలో అనేక అవినీతి.. అక్రమాలు తరచుగా వెలుగుచూస్తునే ఉండటం విస్మయపరుస్తోంది. అయినా బాధ్యులైన యంత్రాంగంపై చర్యలు ఉండటం లేదు. దీంతో నానాటికి అవినీతి.. అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతుంద నే అభిప్రాయం లేకపోలేదు. తెనాలి ఉప ఖజానా కార్యాలయంలో అక్కడ పనిచేసే చిరుద్యోగి ఒకరు తన బంధువుల ఖాతాలోకి రూ.30 లక్షలు మళ్లించినట్లు ఇటీవల బయటపడటంతో మరోసారి జిల్లా ఖజానాశాఖ వ్యవహారాలు చర్చనీయాంశమవుతున్నాయి.
రేపల్లెలో రూ.24 లక్షలు
గతేడాది రేపల్లె ఉప ఖజానా కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సంబంధించిన రూ.24 లక్షల చెక్కును యార్డుకు చెందిన కొందరు ఉద్యోగులు, స్థానిక ఖజానా కార్యాలయ సిబ్బంది, అధికారులు కలిసి పక్కదారీ పట్టించినట్లు గుర్తించారు. అప్పట్లో ఆ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అది మరవకుండానే తాజాగా తెనాలిలో దాన్ని తలదన్నేలా అక్కడ పనిచేసే చిరుద్యోగి ఒకరు సుమారు రూ.కోటికి పైగా నిధులు తన బంధువుల ఖాతాలోకి మళ్లించినుట్ల శాఖ ఉన్నతాధికారులు అనుమానించి ఈమేరకు తెనాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా గుంటూరు జిల్లాలో అక్రమాలు జరగటం ప్రశ్నార్థకమవుతోంది. శాఖ ఉద్యోగులే కొందరు జిల్లా శాఖలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలను చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటా.. రెండా కప్పిపుచ్చుకోవటానికి.. సరిపుచ్చుకోవటానికి అని ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో జరిగే అవినీతి వ్యవహారాల్లో ఏమైనా ఉన్నతాధికారుల పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావని శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిధులకు కాపలా కుక్కలా వ్యవహరించాల్సిన ఖజానా అధికారులే వాటిని భక్షించే ప్రయత్నం చేయటం విమర్శలకు దారితీస్తోంది. గత మూడేళ్ల నుంచి చూస్తే అనేక అక్రమాలు జిల్లాలో బయటపడ్డాయని అయినా ఎవరిపై సరైన చర్యలు లేవని ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.

దుర్గగుడి పైవంతెన లెక్క తప్పింది


దుర్గగుడి పైవంతెనను ఖచ్చితంగా ఏడు నెలల్లో పూర్తిచేసేందుకు రూపొందించిన ప్రణాళికలు అనుకున్నట్టుగా పట్టాలెక్కలేదు. దీంతో మరో నాలుగు నెలల సమయం అదనంగా పట్టనుంది. తొలుత అనుకున్నట్టుగా.. మే రెండో వారానికి కల్లా పిల్లర్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. అనంతరం రెండు నెలల్లో సెగ్మెంట్లను సిద్ధం చేసి పిల్లర్లపై అమర్చి ఆగస్టు నాటికి పైవంతెనను అందుబాటులోనికి తేవాలనుకున్నారు. అయితే.. ప్రస్తుతం జూన్‌ (మిగతా 15లో)
నెల సగం గడిచిపోయినా ఇంకా పిల్లర్ల నిర్మాణ దశలోనే ఉంది. వీటికి మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో అనంతరం మూడు నెలల్లో మిగతా సెగ్మెంట్ల పనులు చేపట్టి డిసెంబర్‌ నాటికి అందుబాటులోనికి తేనున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.
పైవంతెన నిర్మాణంలో ప్రధానంగా డిజైన్ల రూపకల్పన విషయంలో ఆలస్యం జరగడం వల్ల పనులు జాప్యమయ్యాయి. ఇప్పటికీ ఇంకా సెగ్మెంట్ల డిజైన్‌ విషయంలో స్పష్టత రాలేదు. ఇది కొలిక్కి వచ్చాకే సెగ్మెంట్ల తయారీ ప్రారంభమవుతుంది.
మొదట్లో కాస్టింగ్‌ యార్డ్‌ ఇచ్చేందుకు స్థానికుల నుంచి ఎదురైన వివాదం వల్ల కొంత ఆలస్యం జరిగింది. పునాదులు వేసే సమయంలో సమాంతరంగా కాస్టింగ్‌యార్డ్‌లో సెగ్మెంట్లను రూపొందించడం సాధ్యం కాలేదు. అందుకే ఇప్పటికీ సెగ్మెంట్లకు సంబంధించిన సిమెంట్‌ పనులు కాస్టింగ్‌ యార్డులో ప్రారంభం కాలేదు.
నాలుగులేన్ల రహదారికి అవసరమైన స్థలం సేకరణ ఆలస్యమైంది. భవానీపురం నుంచి విద్యాధరపురం హెడ్‌వాటర్‌వర్క్స్‌ వరకూ ఉన్న ఆక్రమణల తొలగింపులో జాప్యం జరగడమూ ఓ కారణమే.
పైవంతెనకు వేసే 46 పిల్లర్లలో 11 కృష్ణా నది, కాలువల్లో వేయాల్సి ఉంది. భూమిపై తవ్వినంత సులభంగా నీటిలో పునాదులు తవ్వడం, పైల్స్‌ వేయడం సాధ్యం కాకపోవడంతో ఇక్కడా ప్రణాళికలో లెక్క తప్పింది. ఇప్పటికీ కృష్ణా నదిలో, కాలువల్లో పనులు తొలి దశలోనే ఉండడమే దీనికి కారణం.